వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో మరో షాద్ నగర్ తరహా ఉదంతం

0
394 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామంలో మరో షాద్ నగర్ తరహా ఉదంతం వెలుగు చూసింది. నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17) అనే యువకుడు, కాశీంపూర్ గ్రామానికి చెందిన ఒక 16 ఏళ్ల బాలికతో ప్రేమలో పడి, మూడు నెలల క్రితం ఇంటి నుండి పారిపోయారు. ఈ ఘటనపై బాలిక కుటుంబసభ్యులు నరేష్‌పై కిడ్నాప్ ఆరోపణలు చేయడంతో, పోలీసులు నరేష్ తల్లి కళావతిని బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. అయితే, నరేష్ అడ్రస్ చెప్పాలని అడిగినప్పుడు ఆమెపై లాఠీదెబ్బలు కురిపిస్తూ, కాల్లు, చేతులు వాచిపోయేలా చిత్రహింసలు చేశారు. గత మూడు నెలలుగా నరేష్ తల్లి కళావతి స్టేషన్‌కు రావాలని, రాగానే ఆమెను కొట్టడం, బయట కూర్చోబెట్టడం జరుగుతూనే ఉంది. ఈ హింసలు ఆమె కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్నాయి. ఈ సంఘటనపై వివిధ సంఘాలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.