వికారాబాద్ జిల్లాలో కొత్తగా 19 గ్రామ పంచాయతీలు

0
2,768 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో కొత్తగా 19 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గతంలో ఆమ్లెట్ విలేజ్ లుగా ఉన్న గ్రామాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన జీవోలో కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే 566 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా 19 గ్రామ పంచాయతీలు చేరడంతో ఆ సంఖ్య 585 కు చేరింది. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో ధారూర్ మండలంలో లక్ష్మీ నగర్ తండా, కొండాపూర్ కుర్దు గ్రామపంచాయతీలుగా ఏర్పడగా మర్పల్లి మండలంలో రాంపూర్, కుడుగుంట గ్రామాలను గ్రామపంచాయతీలుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా బంట్వారం మండలంలో  మంగ్రాస్ పల్లి, పూడూరు మండలంలో రాకంచెర్ల, కుల్కచర్ల మండలంలో డిప్లా నాయక్ తండా, పెద్దముల్ మండలంలో తిమ్సాన్పల్లి, బొమ్మిరాస్పేట్ మండలంలో సోమ్లా నాయక్ తండా, కట్టుకల్వతండా, సీత నాయక్ తండా, దౌల్తాబాద్ మండలంలో తిమ్మాయిపల్లి , తిరుమల పూర్, యాలాల్ మండలంలో దేవులతండా, పెర్కంపల్లి తండా, బషీరాబాద్ మండలంలో మల్కన్ గిరి తండా, గంగ్వార్ గ్రామాలను గ్రామపంచాయతీలుగా చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.