కొత్త గ్రామ పంచాయతీలతో గ్రామాలు అభివృద్ది చెందుతాయి: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0
822 Views

వికారాబాద్: కొత్త గ్రామపంచాయతీలతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ధారూర్ మండలం కేరెళ్లి అనుబంధ గ్రామం కొండాపూర్ కుర్దు గ్రామస్తులు నూతన గ్రామ పచాయతీగా ఏర్పడడంతో కలిసి సన్మానించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో నియోజకవర్గంలో కావాల్సిన గ్రామపంచాయతీల కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కృషి ఎంతో ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.వికారాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రివర్యులు  చంద్రశేఖర రావు కి కోరగా వారు సానుకూలంగా స్పందించి నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు కృషి చేయడం జరిగిందన్నారు . ధారూర్ మండలంలోని కెరెల్లి గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన కొండాపూర్ కుర్దు నూతన గ్రామపంచాయతీ అవడం పట్ల గ్రామం అభివృద్ధి చెందుతుందని మా గ్రామాన్ని మేమే పరిపాలించుకుని అవకాశం వచ్చిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు .తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి  వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు గ్రామస్తులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.