ముఖ్యమంత్రికి దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి: కేటీఆర్

0
272 Views

అనంతగిరి డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొడంగల్ పోదాం. లేదా ఉమ్మడి పాలమూరు ఏ నియోజకవర్గమైన పోదాం….సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం…ఆ ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయాలని సవాల్ విసిరారు. భయపెట్టే వోళ్లు,  చీఫ్ సెక్రటరీలు ఎవరూ వద్దని కేవలం నువ్వు నేను మీడియా పోదామని పేర్కొన్నారు. నిజమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా నా ఇంటర్వ్యూ లు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈగ ఉండదని పేర్కొన్నారు. మరి చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తారా…?