వికారాబాద్ లో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలు

0
52 Views

వికారాబాద్:వికారాబాద్ పట్టణంలో వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామ మందిరంలోని కన్యాకపరమేశ్వరి దేవాలయంలో, వైభవ లక్ష్మీ దేవాలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు పూజలు చేశారు.. అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. పట్టణంలోని మహిళలు తమ ఇండ్లలో కూడా వరలక్ష్మీ వ్రత పూజలను చేశారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరిచి, సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి, పసుపు బొట్టును అందించారు. ఈ వేడుకలు పట్టణవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటూ, మహిళలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.