బీజేపీ నాయకుడిపై దాడి .. ప్రభుత్వ భూమిని కాజేసే కుట్ర: బీజేపీ రాష్ట్ర నాయకుడు సదానందారెడ్డి

0
246 Views

వికారాబాద్ : ప్రభుత్వం మిగిలిన భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రెవెన్యూ ఉన్నత అధికారులు ఫిర్యాదు చేసిన మేరకు బాధితుడు పూడూరు బిజెపి అధ్యక్షుడు రాఘవేంద్ర పై దాడి జరుగడంతో  బాధితుడు వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి కి చనుగోముల్ పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కడ్మూర్ ఆనంద్ ఎంకేపల్లి శివారులో సర్వే నంబర్ 99.100 లో ప్రభుత్వం మిగిలిన భూమి కబ్జా చేశారని పూడూర్ మండల బిజెపి అధ్యక్షుడు రాఘవేందర్ గతంలో ఫిర్యాదు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం తెల్లవారుజామున కాంగ్రెస్ నాయకులు కడ్మూర్ ఆనంద్ తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి మాట్లాడుతూ. పూడూర్ మండల బిజెపి అధ్యక్షుడు రాఘవేందర్ ఎంకేపల్లి లోని ఒక వెంచర్లో పనిచేస్తుండగా కాంగ్రెస్ నాయకులు కడుము ఆనంద్ తమ అనుచరులతో దాడికి ప్రయత్నించగా అక్కడ నుంచి బాధితుడు తప్పించుకొని పరారీ అయినట్లు తెలియజేశారు. బాధితుడు వాహనంలో పరారీ అవుతుండగా వారు మరో వాహనంలో వెంబడించి పూడూరు గ్రామంలో హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. పూడూరు గ్రామంలో తన సర్వీస్ రివాల్వర్ వరకు తీసుకొని చంపేస్తానని బెదిరించారని అన్నారు. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం మిగిలి భూమిని కాపాడి పేదలకు పంచాలని తమ నాయకుడు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ నాయకులు అధికార బలంతో దాడులకు పాల్పడడం దారుణమని అన్నారు. ఈ విషయమై చర్య తీసుకోవాలని వికారాబాద్ ఎస్పీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అలాగే బాధితుడికి ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. ఫిర్యాదుదారుపై దాడి చేస్తే పోలీసులు ఆయన వెంటే ఉండి బాధితురుని రక్షించకపోవడం దారుణమని అన్నారు