నిరుద్యోగులకు ఆయా కోర్సుల్లో శిక్షణ

0
90 Views

 

వికారాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యములో నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బీసీడిడబ్ల్యూఓ ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. టిజి.బిసి.ఇయస్ డి టి సి (టిజి.బిసి. స్టడీ సర్కిల్ ) రెఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, ఏర్ కండిషనర్ రిపేర్, ఇన్స్టలేషన్ & గ్యాస్ ఛార్జింగ్ & యల్ టీవి , ఓ యల్ ఇ డి మానిటర్, మైక్రోవేవ్ ఒవెన్, వాటర్ ప్యూరిఫైర్ & బేసిక్ యచ్ ఏ రిపేర్, మరియు ఇన్స్టలేషన్ స్పోన్సోరింగ్ ఆఫ్ యల్ జి. హాప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ, యన్ యస్ఐసి ఎలెక్ట్రోనిక్ కాంప్లెక్స్ కుషాయిగూడ లో బి సి కులస్తులకు శిక్షణ ఇవన్నట్లు ఆయన తెలిపారు.రిప్రిజేటర్, వాషింగ్ మిషన్ , ఏర్ కండిషనర్ రిపేర్, ఇంస్టాలేషన్ మరియు గ్యాస్ ఛార్జింగ్ కు10వ తరగతి , ఐటిఐ/డిప్లొమా / ఇంటర్మీడియట్ / వొకెషనల్ అర్హత కలిగిన వారికి
అదేవిధంగా యల్ టీవి , ఓ యల్ ఇ డి మానిటర్, మైక్రోవేవ్ ఒవెన్, వాటర్ ప్యూరిఫైర్ & బేసిక్ యచ్ ఏ రిపేర్, మరియు ఇన్స్టలేషన్ కు 10వ తరగతి / ఇంటర్మీడియట్ / వొకెషనల్ అర్హత కలిగిన వారికి
90 రోజులపాటు శిక్షణ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.ఈ సంస్థ నుండి నెలకు 4000 రూపాయల చొప్పున 3 నెలలు ట్రైనింగ్ పీరియడ్ స్టైఫండ్ ఇవ్వబడుతుందని అన్నారు.శిక్షణ సమయంలో స్టడీ మెటీరీయల్ , లంచ్, టి.షర్ట్ , బ్యాగ్, సర్టిఫికే షన్ (L4 లెవెల్ ) , జాబ్ ప్లేస్ మెంట్ ( ఇండియా /అబ్రోడ్ ) ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన వెంటనే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (యన్ సి వి ఇ టి ) Lv4 సర్టిఫికేట్ మరియు ప్లేస్ మెంట్ ఇవ్వబడుతుందని తెలిపారు. కనీస అర్హత 10వ తరగతి మరియు వయస్సు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి సంవత్సర ఆదాయము 5.00 లక్షల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులని ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఆయన తెలిపారు.
దరఖాస్తు చేసుకోవలసిన వారు ఆన్లైన్ లో www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆగస్టు 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.