అమ్మ ఆదర్శ పాఠశాల నిదులు విడుదల:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
173 Views

వికారాబాద్:జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు ప్రారంభించబడిన 966 పాఠశాలలో 451 పాఠశాలలో పనులు పూర్తి చేసుకోబడినవి. ఇందుకు గాను ఎంపీడీవోలు మరియు మండల స్పెషల్ ఆఫీసర్స్ , స్క్రూటీని ఆఫీసర్స్ ద్వారా పరిశీలన జరిగిన తర్వాత 4 కోట్ల 41 లక్షల, 52 వేల 751 రూపాయలు డైరెక్ట్ గా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అకౌంట్లో జమ చేయబడినవని జిల్లా కలెక్టర్  తెలిపారు. అయితే పాఠశాలలన్నింటికీ 25% నిధులు పనులు ప్రారంభించక ముందే మంజూరు చేయబడినవి. ప్రస్తుతం మిగిలిన 75% నిధులను కూడా బుదవారం మంజూరు చేసినట్లు ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్  తెలిపారు