స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వచ్చిన రుణమాఫీ డబ్బులు రైతులకు ఎందుకు రాలేదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0
794 Views

వికారాబాద్: తెలంగాణ శాసన సభాపతి గడ్డంప్రసాద్ కుమార్ కు వచ్చిన రుణమాఫీ డబ్బులు రైతులకు ఎందుకు రాలేవని మాజీ  ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. స్పీకర్ రైతు  కావచ్చాని స్పీకర్ కు రావోద్దని మేము ఆనడం లేదని, ఆయన వాపసు ఇచ్చినప్పటికీ   రైతులకు కూడా కాంగ్రెస్ చెప్పిన విధంగా రుణమాఫీ చేయాలన్నారు. రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని కానీ ఎక్కడ కూడా రైతులు రుణమాఫీ అయిందని  సంబరాలు చేసుకోవడం లేదన్నారు. రైతులు వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల వద్ద బారులు తీరి రుణమాఫీ కోసం ఆందోళనలు చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్ర మంత్రులు చెప్పేదానికి రైతు రుణమాఫీకి ఎక్కడ పొంతన లేదన్నారు. ముందు రుణమాఫీ కోసం 49 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పిన కాంగ్రెస్ నాయకులు దాన్ని ఇప్పుడు కేవలం 7500 కోట్లకు సరిపెట్టారని ఈ విషయం స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారన్నారు. 2 లక్షల రుణమాఫీ అయిందని వారే చెబుతూ మళ్లీ సాంకేతిక కారణాలతో కొంత కాలేదని వారు చెబుతున్నారన్నారు. అసెంబ్లీ ముందు తెలంగాణ విగ్రహాం పెట్టాలని బీఆర్ఎస్ ఆలోచిస్తే ఇప్పుడు అక్కడ తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి విగ్రహాం పెడుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని పేర్కొన్నారు.షరతులు లేని రుణమాఫీ చేసి ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని పేర్కొన్నారు. గతంలో లక్ష లోపు రుణమాఫీలను కేసీఆర్ 7500 కోట్లతో చేశారని ఇప్పుడు రెండు లక్షలు అన్న కాంగ్రెస్ అంతే ఖర్చు చేసిందని కొత్తగా ఏమి చేయలేదన్నారు. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు మానుకోని వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున  ప్రజల తరుపున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, కృష్ణ, నాయకులు మేక చంద్రశేకర్ రెడ్డి, రాంరెడ్డి, దేవదాసు, సుభాన్ రెడ్డి, అనిల్, గిరిష్ కోఠారీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.