వికారాబాద్ లో 23న జాబ్ మేళా:జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబూస్ సుభాన్

0
176 Views

వికారాబాద్:ప్లిప్ కార్ట్ నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబూస్ సుభాన్ ఒక ప్రకటన తెలిపారు.జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్
వికారాబాదు నందు ఆగస్టు 23 శుక్రవారం ఉదయము 10:30 గంటలకు ” జాబ్ మేళా ” ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్లిప్ కార్ట్ లో సుమారు 100 డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయని వీటికి అబ్బాయిలు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు. ఇట్టి ఉద్యోగానికి పదవ తరగతి అంతకంటే ఎక్కువ విద్యా అర్హత కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఇట్టి ఉద్యోగాలు హైదరాబాదులోని
ప్రఖ్యాత ప్రైవేటు పరిశ్రమల యజమాన్యము తమ పరిశ్రమలకు అవసరమగు సిబ్బందిని ఈ జాబ్ మేళ ద్వారా ఎంపిక చేసుకుంటారని ఆయన తెలిపారు. ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ 9676047444 ద్వారా సంప్రదించవచ్చునని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.