టూ వీలర్ వాహనదారులు నిబంధనలు పాటించాలి: సీఐ నాగరాజు

0
362 Views

వికారాబాద్: టూ వీలర్ వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపాలని వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపారు. బుధవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేసి నెంబర్ ప్లేట్ వాహనాలను, సైలెన్సర్ మార్చి నడుపుతున్నవాహనాలను ఆపి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ  మాట్లాడుతూ. ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేయడంజరిగిందన్నారు. చాలా మంది యువకులు సైలెన్సర్ మార్చి సౌండ్ పొల్యూషన్ తో వాహనాలు నడుపుతున్నారన్నారు. కొందరూ కావాలని నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.