ఇంటింటికి మొక్కలు పెంచాలి: మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

0
203 Views

వికారాబాద్ : ప్రతి ఒక్కరు తమవంతుగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. గురువారం స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 14, 24, 25, 33 వార్డులలో ఇంటింటికి మొక్కలు పంచే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డితో కలిసి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు ఇంటిముందు మొక్కలు నాటి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీదేవి సదానంద్ రెడ్డి, రామస్వామి, నాయకులు సదానంద్ రెడ్డి, శానిటేషన్ ఇన్చార్జి ఎస్సై యేసు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.