ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

0
151 Views

వికారాబాద్ (బంట్వారం): బంట్వారం మండల కేంద్రంలో ని మోడల్ స్కూల్ లో గురువారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతను వివరించారు. క్రీడలు కేవలం శారీరక శక్తిని పెంచడమే కాకుండా, మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని. క్రీడల్లో పాల్గొనడం ద్వారా మనం సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సహనాన్ని పెంపొందించుకోవచ్చని ఆమె అన్నారు.
క్రీడలలోనూ, చదువులోనూ సమానంగా ప్రతిభ చూపాలని సూచించారు. అనంతరం పాఠశాల మైదానంలో విద్యార్థులు నేషనల్ స్పోర్ట్ డే అని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.