నిండు కుండలా చెరువులు…అలుగు పారి ప్రవహిస్తున్న వాగులు , నిలిచిన రాక పోకలు

0
294 Views

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో వర్షం దంచి కొడుతుంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లాలోని చెరువులన్ని నిండు కుండలా మారి అలుగు పారి ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లాలో చాలా గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా పరిధిలోని కోట్ పల్లి, సర్పన్ పల్లి, నందివాగు, శివసాగర్ చెరువు అలుగు పారి ప్రవహిస్తున్నాయి. దోర్నాల్, నాగ సముందర్, నాగారం, ద్యాచారం, ధన్నారం, గిరిగేట్ పల్లి, నూర్లపూర్ , మద్గుల్ చిట్టంపల్లి, సస్కల్ వద్ద వాగులు ఉదృతంగా ప్రహించడంతో  ఆయా మార్గాల్లోరాక పోకలను  నిలిపి వేశారు. పోలీసులు ముందస్తుగా వాగులు ప్రవహించే మార్గంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. అయినా కూడా అక్కడకక్కడ కొందరూ అత్యుత్సహంకు పోయి వాగులుదాటే ప్రయత్నం చేస్తున్నారు. తాండూర్ మహబూబ్ నగర్ రోడ్డు మార్గంలో కొడంగల్ మండల పరిధిలోని పర్సాపూర్, గుండ్లకుంట గేటు సమీపంలో రోడ్డు తెగిపోవడంతో తాండూర్ మహబూబ్నగర్ రూట్ లో బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దౌల్తాబాద్  మండలం లోని బలంపేట చెరువు నిండి అలుగు పారింది. బొంరాస్  పేట మండలం, వికారాబాద్ మండంలోని బూర్గుపల్లి, మోమిన్ పేట మండలం చంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన వడ్డే రేణుక ఇల్లు భారీ వర్షానికి కుప్ప కూలింది. దోమ మండలం ఉదృతంగా దొంగ ఎంకేపల్లి వాగు ప్రవహించడంతో రాక పోకలు నిలిచిపోయాయి. దోమ మండలం బ్రాహ్మణపల్లి వాగు రోడ్డుపై పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొడంగల్ మండలం పోచమ్మ తండా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బషీరాబాద్ రైల్వే గేటు సమీపంలో లో లెవెల్ బ్రిడ్జిపై  వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా, తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులో  బండల వాగు ఉదృత్తంగా ప్రవహిస్తుంది.   ఇనెల్లి వాగు…తాండూర్ – చించాలి మధ్య వాహనాల రాక పోకలు బంద్ అయ్యాయి. గొట్టిముక్కుల -ద్యాచారం రోడ్డుపై పొంగి ప్రవహిస్తుండడంతో  గ్రామస్తుల సహకారంతో ప్రజలు రోడ్డు క్రాస్  చేయకుండా వికారాబాద్ సి. ఐ. నాగరాజు చర్యలు చేపట్టారు.