పండుగలను భక్తి శ్రద్దలతో బాధ్యతతో నిర్వహించాలి: జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

0
227 Views

వికారాబాద్:పండుగలను భక్తి శ్రద్దలతో బాధ్యతతో నిర్వహించాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ అంబేద్కర్ భవనంలో మత పెద్దలు, ఆయా శాఖల అధికారులతో కలిసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా శాంతి సమావేశం నిర్వహించామని పోలీస్ శాఖ తరుపున పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లుతెలిపారు. మండపాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని, అందులో భాగంగా మండపాల వివరాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. జీయో ట్యాగింగ్ లో మండపాలు ఉండడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డీజే అనుముతులు ఇవ్వడం జరుగదన్నారు. మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ. మునిసిపల్ తరుపున మండపాలకు, శోభయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో వాసుచంద్ర, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ రాఘవీణా, నాయకులు మాదవరెడ్డి, తస్వర్ అలీ, చిగుళ్ల పల్లి రమేష్, జాఫర్, శ్రీనివాస్ గౌడ్, శివరాజ్, కేపీ రాజు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.