చెరువుల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక

0
122 Views

అనంతగిరిడెస్క్:తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి, అని పేర్కొన్న ఆయన, ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ తక్షణ చర్యలను ప్రస్తావించారు. “అందుకే, ఆక్రమిత చెరువులను పునరుద్ధరించేందుకు హైడ్రా ప్రాజెక్టు ప్రారంభించాము అని వెల్లడించారు.ఆక్రమణదారులపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ, “ఎంత గొప్ప వ్యక్తులైనా చెరువులను వదలక తప్పదు,” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా చెరువులను విడిచి పెట్టి గౌరవంగా పక్కకు తప్పుకోవాలి, లేకపోతే ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతుందని హెచ్చరించారు. “మీరు చెరువులను వదలకపోతే, ఉన్నపళంగా నేలమట్టం చేస్తాం” అని సీఎం హెచ్చరికలు జారీ చేశారు.ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా చెరువులను నీటి పారుదల శాఖ ఆధీనంలోకి తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు. ఈ చర్యల ద్వారా ఆక్రమిత భూభాగాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని, రాష్ట్రంలో వరదల నియంత్రణకు అవరోధాలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ చర్యల ద్వారా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు కట్టుబడి ఉందని, ప్రజలకు పునరావాసం కల్పించడంలో కీలకమైన నడతలను తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.