గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించింది:స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
207 Views

వికారాబాద్(మోమిన్ పేట్):గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించి,అప్పుల కుప్ప చేసిందని తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.శుక్రవారం  వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల MPDO కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన  గృహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకే గ్యాస్ బండ లబ్ధిదారులకు దృవీకరణ పత్రాలను అందజేసారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ లను అమలు చేస్తున్నారన్నారు.ఎన్నికల ప్రచార సమయంలో ఆరు గ్యారంటీ లను మీ గడప దాకా తెచ్చిస్తామని హామీ ఇచ్చాను, ఈరోజు వాటిని అందిస్తున్నా అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నలబై ఎనిమిది గంటల్లోనే RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ పథకం వచ్చినప్పటి నుండి వికారాబాద్ జిల్లాలో 1.70 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలియజేసారు.రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ ఖర్చుల కింద RTC కి రూ.908 కోట్లు ఇచ్చిందన్నారు.ప్రజలకు మేలు చేయాలని అన్ని పథకాలను అమలు చేయాలని ఉన్నది. కాని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించిందని. అప్పుల కుప్ప చేసిందని పేర్కొన్నారు.పెద్ద కొడుకు అని చెప్పుకున్న ఆయన అందరిని నట్టేట ముంచిపోయిండు. రాష్ట్రాన్ని చిల్లంకొల్లం చేశాడు.భూములు, ఇసుక, కరంటు, నీళ్ళు అన్ని అమ్ముకున్నడు, దోచుకున్నాడు, గత ప్రభుత్వంలో ఒక్కటే కుటుంబం బాగుపడిందన్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పథకం మొదలు పెడదామన్నా గత ప్రభుత్వం చేసిన అప్పులే అడ్డంపడ్తున్నాయి.పైగా ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దడానికి రేవంత్ రెడ్డి  రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొత్తం జీతాలు ఇచ్చే పరిస్థితి, ఇప్పుడు ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయి.చరిత్రలో ఎక్కడా లేని విదంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫిని అందించారు.హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే మహిళలకు రూ. 2500 ఆర్ధిక సహాయం అందజేయడం జరుగుతుందని ఆయన పేర్వొన్నారు.