రోడ్ ఆక్సిడెంట్ లపైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆక్సిడెంట్ లు జరగకుండా, జాగ్రతలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి

0
134 Views

వికారాబాద్: జిల్లా పోలీస్ అధికారులందరు రోడ్ ఆక్సిడెంట్ లపైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆక్సిడెంట్ లు జరగకుండా, జాగ్రతలు తీసుకోవాలని జిల్లా ఎస్‌పి  నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్‌పి కార్యాలయంలో పోలీస్ అధికారులందరితో సమీక్షా సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముందుగా జిల్లా నమోదు అయిన కేసుల వివరాలను మరియు పెండింగ్ కేసుల అడిగి తెలుసుకున్నారు . ఈ సంద్బంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను వెంటనే పూర్తి చేయాలని అట్టి కేసులను డి‌ఎస్‌పి మరియు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు దృష్టి సారించి వాటిని వెంటనే పూర్తి చేయాలని, పోలీస్ అధికారులందరు రోడ్డు ఆక్సిడెంట్ లు, ఆత్మహత్యలు కేసులను తగ్గించుట పైన మైయు తమ తమ పోలీస్ స్టేషన్ ల పరిధిలలో సి‌సి‌టి‌వి ల ఏర్పాటు, వెహికిల్ చెకింగ్, డ్రంక్ & డ్రైవ్ చెకింగ్, మట్కా ,జూదం లాంటి అసాంఘిక కార్యకలపాలపైనా ఎన్ఫోర్మెంట్ వర్క్ పెంచాలని, ఆక్సిడెంట్ లు, ఆత్మహత్యలు జరుగకుండా గ్రామాలలో పట్టణాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, 5S పద్దతిని ప్రతి పోలీస్ స్టేషన్ లో పాటించాలని, నిర్లక్ష్యం వహించకూడదు అని కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ నందు నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ లోని ప్రతి యోక్క functional వెర్టికల్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్‌బి‌డబల్యూ లు పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. పాత నేరస్థులు, రౌడీ షీటర్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కౌన్సెలింగ్ లు ఏర్పాటు చేయాలని  తెలిపినారు.పోలీస్ స్టేషన్ లలో నమోదైన గ్రేవ్ కేసులలో నిందితులకు తప్పని సరిగా శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాలని, మహిళలపైనా జరుగుతున్నా నేరాలు, ఎస్‌సి,ఎస్‌టి సంబంధిత లాంటి నేరాలపైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని,డైల్ 100 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని  తెలిపినారు.ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ U.రవీందర్ రెడ్డి ,తాండూర్, పరిగి మరియు వికారాబాద్ డి‌ఎస్‌పి,జిల్లా ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారులు, జిల్లా ఎస్‌ఐ అధికారులు,ఆర్‌ఐ లు,ఆర్‌ఎస్‌ఐ లు తదితరులు పాల్గొనడం జరిగింది.