పేద విద్యార్థులకు రైతు కుటుంబాలకు చేయుత అందించడమే మా లక్ష్యం:టీవివీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్

0
82 Views

వికారాబాద్:పేద విద్యార్థులు చదువులో రాణించాలని, వారికి కావలసిన సౌకర్యాలు అందించి చేత అందించడం తమ కర్తవ్యం అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన ఎన్కెపల్లి, టేకుల గడ్డ తండా, దుద్యాల్, కోడంగల్ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కిసాన్ బందు వారి సహకారంతో ఉచితంగా బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కిసాన్ బందు ప్రతినిధి, టీవీవి రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ వారి ప్రతినిధులతో కలిసి సుమారు 240 బ్యాగులను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు, రైతు కుటుంబాలకు కిసాన్ బందు మిత్రుల సహకారంతో చేయుట అందించి ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థులకు ప్రతి సంవత్సరం బ్యాగులను అందించడం జరుగుతుందని అన్నారు. అంతేకాక విద్యార్థులు చదువులో రాణించాలని డిక్షనరీ గ్రామర్ పుస్తకాలతో పాటు ఆర్థిక సహాయాన్ని స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరిగిందని తెలిపారు ఈచేయుత మొత్తం కిసాన్ బందు ప్రతినిధుల సహకారమని అన్నారు. రైతు ఆత్మహత్యల నివారణలో వారి కుటుంబాలను ఆదుకోవడంలో కిసాన్ బంధు ముందుంటుందని తమ కర్తవ్యం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కిసాన్ బందు ఫౌండర్ సతీష్, సువర్చల ,సాయి, నిత్య, మరియు పాఠశాల హెచ్ఎంలు హరిలాల్ రవీందర్ గౌడ్ బాకారం చంద్రశేఖర్ అనిల్ కుమార్ గౌరారం గోపాల్ నవీన్ కుమార్ రహీం బాల్ రాజ్ తదితరులు ఉన్నారు.