శివ సాగర్ ప్రాజెక్టులోకి మురుగునీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
184 Views

వికారాబాద్: శివ సాగర్ ప్రాజెక్టులోకి మురుగునీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని శివ సాగర్ ప్రాజెక్ట్ అనుసంధాన కాలువను, మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న సమీకృత మార్కెటు దుకాణాల సముదాయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కమిషనర్ జాకీర్ అహమ్మద్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ… ప్రజల నిత్య అవసరాలకు వికారాబాద్ మునిసిపాలిటీకి త్రాగు నీరు అందించే శివ సాగర్ ప్రాజెక్టులోకి మురుగు నీరు చేరి కలుషితం కాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే ఇట్టి ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. పూడూరు మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లోని గ్రామాల నుండి వచ్చే మురుగు నీరు ప్రాజెక్టు లోకి రావడం వల్ల జరిగే ప్రమాదాన్ని గుర్తించిన కలెక్టర్ మురుగు నీటిని కాలువల ద్వారా మళ్లించేందుకు చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుందర్ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తాచెదారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు సూచించారు.మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న సమీకృత మార్కెటును సందర్శించిన కలెక్టర్ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన చేపట్టి చిరు వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు.