మీకోసం నేనున్నా… నన్ను బాగు చేయండి : పాలకులను కోరుతున్న శివసాగర్

0
32 Views

వికారాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు ప్రస్తుత వేసవికాలం అడుగంటి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంటికి తాగు నీరు అందించింది. వికారాబాద్ జిల్లా ప్రాంతానికి శ్రీశైలం బ్యాక్ వాటర్ ను శుద్ది చేసి సరఫరా చేసే వారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయాలు అడుగు అంటుతున్న తరుణంలో రానున్న రోజుల్లో మంచినీటి సమస్య వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాలకులు అధికారులు మంచినీటి ప్రత్యామ్నాయ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు మిషన్ భగీరథ నీటికి బ్రేక్ పడిన వెంటనే ప్రజలకు ప్రత్యామ్నాయంగా నీరు అందించే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ మున్సిపల్ విషయానికి వస్తే సుమారు లక్షకు పైగా మంది జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ నీటికి బ్రేక్ పడితే మంచినీటి అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వికారాబాద్ పట్టణానికి ప్రత్యామ్నాయంగా అనాదికాలం నుంచి తాగునీటిని అందించిన శివసాగర్ చెరువు ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడంలో ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. శివ సాగర్ చెరువు నుంచి నీటిని సరఫరా చేసే క్రమంలో ఫిల్టర్ బెడ్ వద్ద నీటిని శుద్ధి చేసే యంత్రాలను సరి చేయాల్సి ఉన్న గత ఐదు సంవత్సరాలుగా వాటిని పట్టించుకున్న నాధుడే లేరు. గతంలో వాటికోసం కొన్ని నిధులు కేటాయించినప్పటికీ వాటిని మధ్యవర్తులే మింగి నీళ్లు తాగినట్లుగా వివరించడంతో ప్రస్తుతం ఆ పరికరాలు శుద్ధి చేసేందుకు అనుకూలంగా లేకుండా ఉన్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో పాలకులు అధికారులు మధ్య సమన్వయం లేకపోవడం రాజకీయ నాయకుల మధ్య విభేదాలు తప్ప వికారాబాద్ ప్రాంతానికి కావాల్సిన సౌకర్యాలు అవసరాల గురించి మాత్రం పాలకులు ఇటు అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రానున్న వేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్నమవుతున్న తరుణంలో వెంటనే వికారాబాద్ శివ సాగర్ చెరువు లో శుద్ధితో పాటు ఫిల్టర్ బెడ్ వద్ద యంత్రాలను సరిచేసి వికారాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పట్టణం ప్రజలు కోరుతున్నారు. వాళ్ల స్వర్థ రాజకీయాలు పక్కనపెట్టి ప్రజా పాలన సాగించాలని హితువు పలుకుతున్నారు.