బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమాల్ రెడ్డి పై హత్యయత్నం కత్తితో దాడి

0
24 Views

వికారాబాద్: గ్రామ మాజీ సర్పంచ్ పై పాత కక్షలు మనస్సులో పెట్టుకుని, అదును కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి హోలీ వేడుకల్లో కత్తితో దాడి చేసిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు  తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన నారేగూడం కమాల్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా, అదే విధంగా గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ఈ మధ్యనే సర్పంచ్ పదవి పూర్తి కాగా కమాల్ రెడ్డి వికారాబాద్
లో నివాసం ఉంటూ గ్రామానికి వెళ్లి వస్తుంటారు. అయితే కమాల్ రెడ్డి సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన కొత్త గడి నాగిరెడ్డి భార్య. లలిత మధ్య గొడవలు రాగా లలిత బంధువులు గత సంవత్సరం క్రితం గ్రామంలో పంచాయతీ పెట్టారు. సర్పంచ్ కావడంతో గ్రామ పెద్దగా కమాల్ రెడ్డి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నాగిరెడ్డిని మందలించడం అదే సమయంలో లలిత బంధువులు నాగిరెడ్డిపై దాడి చేసే క్రమంలో తోపులాట జరుగగా నాగిరెడ్డి కింద పడి చెయ్యి విరిగింది. దీంతో కోపం పెంచుకున్న నాగిరెడ్డి కమాల్ రెడ్డిని నేను చం
పుతానని గ్రామంలో చెప్పుకు తిరిగే వాడు. పలు సందర్భాల్లో దాడి చేయాలని కత్తి పెట్టుకుని తిరిగే వాడని అదును కోసం ఎదురు చూసిన నాగిరెడ్డి హోలీ కావడం కమాల్ రెడ్డి గ్రామానికి వెళ్లగా హోలీ ఆడే క్రమంలో
గ్రామంలో ఒక్క సారిగా వచ్చి కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో కమాల్ రెడ్డి చేయి అడ్డు పెట్టడంతో చేతుకు రక్త గాయాలు కాగా మెడ భాగంలో కొంత గాయమైంది. కొద్దిలో ప్రాణాలతో బయట పడ్డ కమాల్ రె
దీని గమనించిన గ్రామస్తులు, బందువులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి సమాచారం అందడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆసుపత్రికి వెళ్లి కమాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని
తెలుసుకుని పరామర్శించారు. అంతే కాకుండా గ్రామస్తులు, బంధువులు, పార్టీ నాయకులుతో ఆసుపత్రి ఆవరణ నిండిపోయింది.