బ్యాంకర్లు అన్ని ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
29 Views

వికారాబాద్:జిల్లాలో అన్ని ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించి పూర్తి లక్ష్యాన్ని సాధించాలని బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిసిసి/ డిఎల్ ఆర్సి సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా డి ఆర్ డి ఏ, మెప్మా తరపున సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళా సంఘాల సభ్యులకు సూక్ష్మ ప్రణాళికలను సిద్ధం చేసి రూ. 100 కోట్ల రూపాయల చెక్కులను 4వ తేదీ వరకు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున వచ్చే 5 సంవత్సరాలలో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు బ్యాంకర్లు అన్ని ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించాలని అన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా రంగాల అభివృద్ధికి రుణాలు అందించేందుకు పరిశ్రమల శాఖ అధికారి, ఎల్ డి ఎం లు ఫిబ్రవరి మాసంలో లోన్ మేళాలు నిర్వహించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రుణాలను ఫిబ్రవరి మాసంతం వరకు అందజేయాలని, లేనిచో బ్యాంకులపై చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.వ్యవసాయ రంగానికి 3829.86 కోట్ల లక్ష్యం కాగా, 2240.25 కోట్లు అందించి 58.49 శాతం లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1200.55 కోట్లు లక్ష్యం కేటాయించగా, 392.97 కోట్ల రుణాలు అందజేసి 33.73 లక్ష్యం సాధించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు 6361.52 లక్ష్యం కాగా, రూ. 2663.56 కోట్లు అందచేసి 41.87 శాంతం లక్ష్యాన్ని, అలాగే ప్రాధాన్యతర రంగాలకు 1046.50 లక్ష్యం కేటాయించగా 399.08 కోట్ల రుణాలను అందజేసి 38.13 లక్ష్యం సాధించడం జరిగిందన్నారు. ఖరీఫ్ సీజన్ పంట రుణాలకు రూ. 1550.00 కోట్ల లక్ష్యం కాగా, 1224.96 కోట్ల రుణాలు అందజేసి 79 శాంతం లక్ష్యం సాధించినట్లు బ్యాంకర్లు తెలిపారు. పంట రుణాలు 90 శాతంకు తగ్గకుండా లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ బ్యాంకర్లకు ఆదేశించారు.ఈ సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 6736.82 కోట్లతో రూపొందించిన ప్రొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఎల్ డి ఎం రాంబాబు, ఆర్.బి.ఐ/ ఎల్ డి ఓ యస్. గోమతి, నాబార్డ్/ డిడిఎం పీయూష్, డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వినయ్ కుమార్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.