తెలంగాణ ఉద్యమకారుని మృతి బాధాకరం: బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్

0
14 Views

వికారాబాద్: తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించిన గోధుమగూడ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్ ఆకస్మిక మరణం బాధాకరమని ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు బీసీ కమిషన్ మెంబర్ శుభ ప్రద్ పటేల్ తెలిపారు. మంగళవారం లక్ష్మీనారాయణ గౌడ్ నివాసానికి జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తో కలిసి వెళ్లి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో లక్ష్మీనారాయణ గౌడ్ ప్రముఖుడని ఎన్నో దఫాలు పోలీస్ కేసులు నమోదయి జైలుకు సైతం వెళ్లి వచ్చాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి తో పటు నాయకులు భూమోళ్ళ కృష్ణ , దత్తు , నర్సిములు , శివకుమార్ ఉన్నారు.