నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చేయండి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

0
62 Views

నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అల్టిమేటం జారీచేశారు. “బీఆర్ఎస్ పార్టీ బిల్డింగ్ కూల్చేయమని ఎప్పుడో చెప్పాను కదా. ఎందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారు? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అమెరికా వెళ్లి ఈ నెల 11న తిరిగి వచ్చేలోపు ఆ బిల్డింగ్ నాకు కనపడొద్దు, అని మంత్రి అధికారులను హెచ్చరించారు.

మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేయడం ద్వారా మంత్రి కోమటిరెడ్డి తన నిర్ణయం అమలు చేయడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.