వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు:జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి బి. క్రిష్ణవేణి

0
63 Views

వికారాబాద్: అక్టోబర్ 1 న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తేది 25.92024 నుండి తేదీ 01.0.2024 వరకు వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి శ్రీమతి బి. క్రిష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు . కార్యక్రమాల వారిగా వివరాలు వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు , తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమ చట్టం- 2007, పై అవగాహన కార్యక్రమం , ఆరోగ్య సంరక్షణపై గ్రామస్థాయిలోని పంచాయతి సెక్రటరీలకు మరియు గ్రామ పెద్దలకు, తల్లిదండ్రుల పోషణ మరియు సంరక్షణ చట్టం-2007 అవగాహన మరియు వయోవృద్ధుల టోల్ ఫ్రీ నెంబర్ 14567 పై అవగాహన సదస్సు, మరియు అంగన్వాడీ కేంద్రాలలో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహణ చివరగా అక్టోబర్ 1 తారీఖున జిల్లాస్థాయి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంతో కార్యక్రమంతో వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారిణి తెలపడం జరిగింది .