నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
94 Views

వికారాబాద్:నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు, 23 వ వార్డు లలో గల పార్కులలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ లతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ మనుగడ కు మొక్కలే ఆధారమని, సకాలంలో వర్షాలు కురిసేందుకు చెట్లు దోహద పడతాయని,పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మున్సిపల్ పార్కుల అభివృద్ధితోపాటు ప్రజలకు ఉపయోగ పడే వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. పార్కుల్లో యోగ బెడ్స్ ను, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా వివిధ పరికరాలను ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ తెలిపారు. వార్డులవారీగా పారిశుద్ధ కార్యక్రమాలను చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. 23 వ వార్డు చిన్నారుల తో పార్క్ లో మీకు ఎలాంటి ఆట వస్తువులు కావాలని పిల్లలతో ముచ్చటించారు.మున్సిపల్ సిబ్బంది మరియు డి ఆర్ డి ఎ, ఆర్ పి లతో మాట్లాడి వారికి ఉన్న సమస్య లను వివరాలు అడిగి తెలుసు కున్నారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, కమిషనర్ జాకీర్ అహ్మద్, మున్సిపల్ కౌన్సిలర్లు , రామస్వామి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.