వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతిఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
118 Views

వికారాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశము హాలు నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ 129 వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్ధానిక సంస్ధలు )సుదీర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ,తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. వీర నారీ చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  బి సి సంక్షేమ అధికారి ఉపేందర్ , వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, సివిల్ సప్లయ్ అధికారి మోహన్ బాబు, ఇ ఇ పి ఆర్ ఉమేష్ కుమార్ , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.