ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య దురదృష్టకరం: డీఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డి

0
21 Views

వికారాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ హత్య దురదృష్టకరమని దీంతో అటవీశాఖ అధికారులు మనోధైర్యం దెబ్బతింటుందని వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్ రడ్డి తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ గుత్తి కోయల దాడిలో హత్యకు గురైన శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులు అటవీ శాఖ కార్యాలయ ఆవరణలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇప్పటికే అన్ని రకాల భూములు అన్యాక్రాంతం  అయ్యాయని మిగిలి ఉన్న ఈ అటవీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులకు ఉద్యోగంతో పాటు డ్రెస్ ఇచ్చినప్పటికీ వారి భద్రతకు సంబంధించిన ప్రొటెక్షన్ మాత్రం కల్పించలేకపోతున్నారన్నారన్నారు. అటవీశాఖ సిబ్బంది కూడా వెపన్స్ అందించాలని ఆయన సూచించారు. అటవీ శాఖల్లో ఉన్న భర్తీలను వెంటనే పూర్తిచేసి బీట్ ఆఫీసర్లు ఇద్దరుగా అడవిలోకి వెళ్లేందుకు సౌకర్యం వంతంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయని ఆఫీసర్ కు తగ్గ వాహనాలను అటవీశాఖ సిబ్బందికి కేటాయించాలని సూచించారు. పోడు భూముల వ్యవహారంలో గందరగోళం ఏర్పడుతుందని అడవులున్నరకితే భూములు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారని వికారాబాద్ జిల్లా ధారూర్ తో పాటు కొడంగల్ ఏరియాలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ యాక్ట్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు