కేడర్ ని బట్టీ పేస్కేల్స్ ఇవ్వండి….పిఆర్సీ కమిటీ ని కోరిన ఆర్దికశాఖ అధికారులు

0
27 Views

అనంతగిరి డెస్క్:తెలంగాణ రెండవ పీఆర్సీ బుదవారం నుండి వివిధ ప్రధానశాఖల అధికారిక సంఘాల ప్రతినిధులతో చర్చించడం ప్రారంభించింది. అందులో భాగంగా మొదటగా తెలంగాణ ఆర్దిక శాఖ అధికారులైన డీఏఓ ల సంఘం తో ప్రారంభించింది. పనివొత్తిడి, జాబ్ చార్ట్, ఇతర ఆర్దిక మరియు ఇంజనీరింగ్ సమాన కేడర్ లతో బేరీజు వేసుకుని తమ కేడర్ స్కేళ్లు ప్రతిపాదించాలని సంఘం ప్రతిపాదించింది. స్టేట్ కేడర్ లో ఉన్న తమ పోస్టును మల్టీ జోన్ కేడర్ కు దించి 317 జి.ఓ కు తమను బలి చేసారని సుమారుగా 200 మంది ఇబ్బందుల పాలు అయ్యారని అందుకే తిరిగి తమను స్టేట్ కేడర్ లోకి మార్చెలా సిఫారసు చేయాలని విన్నవించారు.. మొత్తం ఆర్దిక పరమైన 11 సూచనలు సర్వీస్ పరమైన 9 సూచనలు ప్రతిపాదించామని సంఘం అధ్యక్షుడు మొహియుద్దీన్ కార్యదర్శి రాధా రమణారెడ్డి తెలిపారు. మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి, పీఆర్సీ చైర్మెన్ శివశంకర్  ఆద్వర్యంలో రెండవ సభ్యులు రామయ్య లతో కలిసి సంఘం రాష్త్ర అద్యక్షుడు శ్రీ మొహియుద్దీన్ నేతృత్వంలో ప్రధాన కార్యదర్శి రాధరమణా రెడ్డి, ట్రెజరర్ హాషం, కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, హైదరాబాద్ జిల్లా అద్యక్ష కార్యదర్శులు వెంకట రమణ, ఉశారాణి లు ఛర్చల్లో పాల్గొన్నారు..