జిల్లాలో గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి:జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి

0
30 Views

వికారాబాద్:జిల్లా లో గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు.సోమవారం ఉదయం టెలి కాన్ఫరెన్సు ద్వారా జిల్లా లో జరిగే అభివృద్ది నిర్మాణ పనులలో గ్రామా పంచాయతి బిల్డింగ్ లేకుండ గ్రామా పంచాయతి ఉండకూడదని, నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా ప్రతి రోజు జరగాల్సిన పనులకు ఎన్ని మిల్లర్లు, ఎంత మంది లేబర్ ఉంటె పనులు త్వరగా పూర్తి చేయవచ్చు అనే విదంగా ముందుకెళ్ళాలని , అంచనా ప్రాకారము పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. బొంరాస్ పెట్ , కోడంగల్ మండలం లో సి సి రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడ కూడా ఆగ కుండ పనులు జరగాలని, ప్రతి గ్రామ పంచాయతి బిల్డింగ్స్, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షేడ్స్ నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పూర్తి కాని పనులను సత్వరమే పూర్తి చేసి , పూర్తి అయిన వాటికీ తప్పని సరిగా ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. జిల్లాలోసి సి రోడ్లకు మంజూరైన నిదులతో అంచనాలను రూపొందించుకొంటూ సి సి రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయలని అధికారులకు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టరల తో మాట్లాడి లేబర్ ను సమీకరించి పనులు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.టెలి కాన్ఫరెన్సు లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు డి ఇ లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.