జిల్లాలో దంచి కొట్టిన వాన…..జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు..

0
122 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం దంచి కొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన భారీవర్షం ఏకదాటిగా ఉదయం వరకు కొరియడం, ఉదయం నుంచి కూడా ముసురు వర్షం ఉండడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.వికారాబాద్ పట్టణ సమీపంలోని శివసాగర్ చెరువు నిండుకుని అలుగు పారుతుండగా,గిరిగేట్ పల్లి వాగు, సర్పన్ పల్లి వాగుతో పాటు దోర్నాల్ వాగు , బంట్వారం నూర్లపూర్ వాగు , కుల్కచర్ల రాంనగర్ వాగుతో పాటు మూసి వాగు ఉదృత్తంగా ప్రవహిస్తుంది. పరిగి నస్కల్ వాగు రావడంతో సైతం రాక పోకలు నిలిచిపోయాయి.  దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు ప్రజలు ఎవరూ వాగులు దాటకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.