మనిషికి నిజాయితీ, సమయపాలన ముఖ్యం :కోట శివకుమార్

0
59 Views

వికారాబాద్: మనిషికి నిజాయితీ సమయపాలన అతి ముఖ్యమైనవని కోట శివకుమార్ తెలిపారు. శ్రీ సత్యసాయి జ్ఞానంకేంద్రం గంగవరం, వికారాబాద్ 22వ వార్షికోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస లు భువి పై వెళ్ళివెరియాలని కోరారు. మనిషికి విశ్వాసం, వినయం, క్రమశిక్షణ జీవితం లో అత్యవసరం అని తెలిపారు “అందర్నీ ప్రేమించు -అందర్ని సేవించు”, ఇతరులకు తోచిన సహాయం చేయాలి కానీ బాధించరాదని చెప్పారు. సభాధ్యక్షులు హారతి ద్వారకనాథ్ మాట్లాడుతూ వ్యక్తి సాధన లేకుండా సేవ చేయడం కష్టమని, పరోక్ష దూషణ మహాపాపమని,మనిషి మనిషికి మధ్యన నమ్మకం ఉండాలని తెలిపారు.ఆ తరువాత పి. బందెప్ప గౌడ్ రచించిన శ్రీ సాయీశ్వర శతకం ముఖ్య అతిథి చేత ఆవిష్కరించబడినది. ఈ కార్యక్రమం లో జగదీశ్వర సింగ్ ఠాకూర్, పున్నయ్య, పద్మాకర్ రావు, రామన్న, శ్రీనివాసులు విశిష్ట అతిథులు గా పాల్గొన్నారు.
డా : సత్యనారాయణ గౌడ్, కపిల్ దేవ్, గోపాల్ రెడ్డి, మనోహర్ రావ్ కులకర్ణి, బసవేశ్వర్, వేణు, విటోభా సతీష్ చంద్ర లు పాల్గొన్నారు.