పొరుగు దేశాలకు ఏ అవసరం వచ్చిన వాళ్లకు గుర్తు వచ్చేది మొదటి పేరు భారత దేశం:మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

0
19 Views

వికారాబాద్ (కోట్ పల్లి):పొరుగు దేశాలకు ఏ అవసరం వచ్చిన వాళ్లకు గుర్తు వచ్చేది మొదటి పేరు  భారత దేశం అని  అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ఖ్యాతిని పెంచిన గొప్ప నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ  చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలోని DMR ఫంక్షన్ హాల్లో కోటిపల్లి బుగ్గాపురం, లింగంపల్లి, అన్నాసాగర్, బార్వాద్ గ్రామాలకు చెందిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన సుమారుగా 300 మంది నాయకులు చేవెళ్ల పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి  సమక్షంలో బిజెపి పార్టీలో చేరినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొరుగు దేశాలకు ఏ అవసరం వచ్చిన వాళ్లకు గుర్తు వచ్చేది మొదటి పేరు భారత దేశం అని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగాకు కేవలం బిజెపి పార్టీకి మాత్రమే ఉంది.
మోసపూరితమైన హామీలతో ఓట్లు అడిగే ప్రభుత్వాలకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి.అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 9 వేల కోట్లు సాయం చేయకుంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరం. హిందువుల మీద దాడులు చేస్తే సహించేది లేదు సెక్యులరిజం పేరుమీద మైనారిటీలకు నజరనాలు, తోపాలు ఇచ్చి మెజారిటీ ఉన్న హిందువులను అవమాన పరుస్తున్నారు.కోటిపల్లి అందమైన గ్రామం, కాయా కింగ్ , బోటింగ్ ప్రాజెక్టు ద్వారా ప్రసిద్ధి చెందేలా చేసిన. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల వలన ఈ ప్రాంత అభివృద్ధి ఆలస్యం అయింది ఖచ్చితంగా మళ్ళీ గెలిచిన తర్వాత కోటిపల్లి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తా. ఈ మధ్యనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనంతగిరి ప్రాజెక్టు అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.కోటిపల్లి మండల ఏర్పాటుకు నా కృషి చానా ఉన్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు యూత్ క్లబ్స్ కట్టించిన. మళ్లీ ఎంపీగా గెలిచిన తర్వాత టూరిజం హబ్ గా తయారుచేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతా.కార్యక్రమంలో వారితోపాటు జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే K.S రత్నం  ,మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్  ,అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి  ,జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి , BJYM జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్ రెడ్డి , వికారాబాద్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు గాలయ్య  ,జిల్లా కోశాధికారి సతీష్  ,పాండు గౌడ్, KP రాజు,జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఉప్పరి రమేష్ , సందీప్  మరియు సీనియర్ నాయకులు మూడు గ్రామాల ప్రజలు, కార్యకర్తలు ,అభిమానులు పాల్గొన్నారు.