న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి:రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

0
205 Views

వికారాబాద్:న్యాయవాదులపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. జనగామలో న్యాయవాదులపై దాడికి నిరసనగా వికారాబాద్ బార్ కౌన్సిల్ అద్వర్యం లో న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు శుభప్రద్ పటేల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల న్యాయవాదులపై ప్రతి చిన్న విషయానికీ దాడులు జరుగుతున్నాయని, దాడుల నుంచి న్యాయవాదులకు సరైన భద్రత ఉండాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమైందని, ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రతి నిత్యం ప్రజల పక్షాన పోరాడే న్యాయవాదులపై దాడి సరికాదని  తెలిపారు. ఈ క్రమంలోనే సాయంత్రం దీక్ష చేస్తున్న న్యాయవాదులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.ఈ కార్యక్రమంలో .. ప్రెసిడెంట్ అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కయ్యుమ్, జనరల్ సెక్రెటరీ వెంకటేష్ సీనియర్ న్యాయవాదులు కమాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బస్వరాజు, సంపూర్ణ ఆనంద్, యాదవ్ రెడ్డి, మాధవ్ రెడ్డి, నారాయణ,వసుంధర, జగన్, కిరణ్ పటేల్,రఫీ, మహేశ్వర రెడ్డి, శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.