27న తలపెట్టిన కురుమ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేద్దాం: కురుమ సంఘం వికారాబాద్

0
18 Views

తాండూరు :  కురుమల ఐక్యతను చాటుతూ ఈ నెల 27న వికారాబాద్ కేంద్రంగా తల పెట్టిన కురుమల ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని విజయయవంతం చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. గురువారం తాండూర్ పట్టణంలో ప్రముఖ వ్యాపార వేత శంకర్ వివాసంలో కురుమ పెద్దలు సమావేశమై సన్నాహక సమావేశం నిర్వహించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ సమాజంలో నమ్మకానికి చిరునామాగా కురుమ కులం నిలుస్తుందన్నారు. తరతరాలుగా మానవ నాగరికత వికాసము చెందటంలో ఆర్థిక పరిపుష్టిని పొందటంలో కురుమ కులము సాధు జంతువులైన గొర్రెలను మేకలలను సాకుతూ కీలక భూమిక ను నిర్వహిస్తూ వస్తుందన్నారు. మన కులమును బీసీ -బి లో చేర్చి మన రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్ సౌకర్యం భారత ప్రభుత్వం కల్పించిందన్నారు. మన ఉనికిని ఇతరులకు దారాదత్తం చేయటం మన కులం అజ్ఞానమవుతుందన్నారు. అందుకే ఇలాంటి ఎన్నో సమస్యలను పంచుకునే అవకాశం తీసుకుని కురుమల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 27 న ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య , ఎగ్గే మల్లేశం హజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య , జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి పాండు, బొండల శ్రీనివాస్ , గోపీల్, యాదగిరి యాదవ్ , వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు