వికారాబాద్ జిల్లాలో ముసురు వర్షం….. చిత్తడిగా జిల్లా కేంద్రం…

0
56 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లాను ముసురు వర్షం ముంచేసింది. ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి మొత్తం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడి రోడ్లు మొత్తం చిత్తగడిగా మారాయి. కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద పర్యాటకులు సరదా కోసం రాగా వారి కారులు బురదలో చిక్కుకు పోగా గ్రామస్తుల సహాయంతో బయట పడ్డారు.

సిరిపురం వద్ద ఆర్టీసీ బస్సు నడి రోడ్డులో బురదలో ఇరుక్కు పోవడంతో ఆదారి గుండా మోమిన్ పేట మర్పల్లి మధ్య రాక పోకలు నిలిచి పోయాయి. ఆర్అండ్ బీ అధికారులు చొరవ తీసుకోవడంతో కొంత సేపటికి రాక పోకలు కొనసాగాయి. వికారాబాద్ పట్టణంలోని రైతు బజారు పూర్తిగా చిత్తడిగా మారి రైతులు ఇబ్బంది కరంగా మారింది. రైతు బజారు మీద ఆదాయం సమకూర్చకుంటున్న మార్కెట్ అధికారులు అక్కడ కనీస సౌకర్యాలు సైతం కల్పించడం లేదని రైతులు, వ్యాపారులు మండి పడుతున్నారు.