చెరువులను కబ్జా చేయడం తప్పు, నా ఫామ్ హౌస్ కట్టడం తప్పుగా తేలిస్తే, నేనే స్వయంగా దాన్ని కూల్చేస్తాను, : పట్నం మహేందర్ రెడ్డి

0
228 Views

హైదరాబాద్: చెరువులను కబ్జా చేసిన వారు ఎవరైనా సరే, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల ఆయన చెరువు దగ్గర ఫార్మ్ హౌస్ కట్టినట్లు వచ్చిన పుకార్లను కొట్టిపారేశారు. “2005లోనే నేను ఆ ఫార్మ్ హౌస్ కట్టాను, అది కూడా పర్మిషన్ తీసుకొని, రూల్ ప్రకారం చిన్నగా కట్టుకున్నాను,” అని మహేందర్ రెడ్డి అన్నారు. “ఎవరైనా ఆ కట్టడం తప్పుగా తేలిస్తే, నేనే స్వయంగా దాన్ని కూల్చేస్తాను,” అని ఆయన స్పష్టం చేశారు.  చెరువులను కాపాడటంలో అందరూ పాత్ర వహించాలన్నారు. “చెరువులు మన పర్యావరణానికి, నీటి నిల్వకు కీలకమైనవి. వాటిని కాపాడటంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి,” అని ఆయన సూచించారు. చెరువుల కబ్జా పై దృష్టి పెట్టి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పట్నం మహేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. “ఇది సామాజిక బాధ్యత, మన భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడే విధంగా మనం చర్యలు తీసుకోవాలి,” అని ఆయన అన్నారు.