పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

0
18 Views

వికారాబాద్ : పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు.మంగళవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ శిక్షణ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా పిఓలు, ఏపిఓ పోలింగ్ ప్రక్రియపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావునీయకుండా సమర్థవంతంగా పని చేయాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన హ్యాండ్ బుక్ లెట్స్ ను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధానాన్ని తెలుసుకోవాలని, ఇంకా ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే మాస్టర్ ట్రైనర్లను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధి నిర్వహణలో పనిచేసే అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా సంసిద్ధం కావాలని కలెక్టర్ తెలిపారు. గత అసెంబ్లీలో పనిచేసిన అనుభవంతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మండల తహసిల్దార్ లక్ష్మీనారాయణ, మాస్టర్ ట్రైనర్లు రామ్ రెడ్డి, వీరకాంతం తదితరులు ఉన్నారు.