ఎస్ఎంసి ఎన్నికలకు నోటిఫికేషన్:డి ఈ ఓ రేణుకా దేవి 

0
16 Views

వికారాబాద్:జిల్లాలో ఎస్ఎంసి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ 20వ తారీకు నాడు ప్రతి పాఠశాలలో నోటీసు ఇవ్వడం జరుగుతుందని డిఈఓ రేణుకాదేవి  తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అదే రోజు పాఠశాలలో ఉన్నటువంటి తల్లిదండ్రుల జాబితా కూడా నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుందని 22 -1- 2024 నాడు , 23 -1 -20 24 నాడు తల్లిదండ్రుల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి ఏమైనా ఉంటే పరిష్కరించడం జరుగుతుందని 24-1- 2024 బుధవారం నాడు ఎస్ఎంసి సభ్యుల ఎన్నిక కొరకు తల్లిదండ్రుల తుది జాబితా ఖరారు చేసి అట్టి జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరుగుతుందని ఆమె తెలిపారు. 29- 1 -2024 నాడు ఎస్ఎంసి సభ్యుల ఎన్నిక ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించిడం జరుగుతుందని, తరువాత అదే రోజు మధ్యాహ్నం 1:30 కి ఎస్ఎంసి చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ విధంగా ఎన్నికైన ఎస్ఎంసి మెంబర్స్ యొక్క మొదటి సమావేశాన్ని 29-1-2024 నాడు మధ్యాహ్నం రెండు గంటల నుండి 4 గంటల వరకు నిర్వహిస్తారని , అయితే ఇట్టి ఎన్నికల్లో ప్రతి తరగతి నుండి ముగ్గురు చొప్పున తల్లిదండ్రులను ఎన్నుకుంటారు . ఈ ముగ్గురిలో ఇద్దరు మహిళలు కచ్చితంగా ఉండాలి. ఈ విధంగా ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతులకు గాను 15 మందిని ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుండి ఏడు తరగతులకు గాను 21 మందిని అదేవిధంగా హై స్కూల్ కి సంబంధించి 6 నుండి 8 తరగతిలో గాను 9 మందిని మెంబర్స్ గా ఎన్నుకుంటారు. వీరిలో నుండే చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటారు. .ప్రధానోపాధ్యాయులకు ఎం.ఈ.ఓ లకు ఎం .ఎన్ .ఓ లకు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం. లకు అందరికీ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని 29వ తారీఖు నాడు ఎన్నికను సజావుగా నిర్వహించి 30  నాడు అట్టి లిస్టులను డీఈఓ ఆఫీసుకు అందించాలని డి ఈ ఓ  రేణుకా దేవి  సూచించారు