పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలి:జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

0
68 Views

వికారాబాద్:పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. ఇటీవల TSPA లో శిక్షణ పూర్తి చేసుకొన్నా 17 మంది సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అధికారులు జిల్లా నందు రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ శిక్షణ కాలం లో నేర్చుకున్న విషయాలను సర్వీస్ మొత్తం ఉపయోగపడుతాయని, పోలీస్ డిపార్ట్మెంట్ లో అధికారులు చేయాల్సిన చెయకూడని పనులను గురించి తెల్సుకోవాలన్నారు, ప్రతి ఒక్కరు సమయపాలన, క్రమశిక్షణ,నిట్ టర్న్ ఔట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని,ప్రజలకు సేవ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రావడం అనే చాలా మంచి విషయం అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని, ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు వచ్చే విధంగా పని చేసి ఒక మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో శిక్షణ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.