అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిన తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల

0
15 Views

తాండూర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి అన్నారు. పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఉదయం కళాశాలకు వచ్చేసరికి క్లాస్ రూమ్ లలో సిగరెట్లు ‘ఫాస్ట్ ఫుడ్ కవర్లు’ మూత్ర విసర్జన తోటి తరగతి గదులు కంపులేసి ఉండటంతో విద్యార్థులు పిడిఎస్యు నాయకులకు తెలుపగా పిడిఎస్యు ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కళాశాలకు సంబంధించినటువంటి సమస్యలు జిల్లా ప్రజా ప్రతినిధులు జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి ‘బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద పటేల్  ల దృష్టికి తీసుకపోయి పిడిఎస్యు ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినా విద్యాధికారులు ‘పోలీస్ అధికారులు కళాశాలలో ఆకతాయిలను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల పట్ల అధికారులు విద్యార్థులకు సమస్యలు పరిష్కరించే దిశగా హామీ ఇవ్వాలి ఆకతాయిలను కట్టడి చేయడం కోసం భరోసా ఇవ్వాలని కళాశాల కు సమయానికి రాకుండా విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని లేకుంటే పిడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని పి డి ఎస్ యు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు సోయబ్’ ప్రకాష్ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది