టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలి….TRSV

0
31 Views

వికారాబాద్ : గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా దాన్ని రూ.1000కి పెంచారని,.రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు వరకు పెంచారని ఫీజులను ఈ స్థాయిలో పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టేనని బీఆర్ఎస్ వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు. బుధవారం బీఆర్ఎస్ వీ ఆధ్వర్యంలో టెట్ అర్హత ఫీజు తగ్గించాలని కోరుతూ టెట్ సూపరింటెండెంట్ నాగరాజు కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా BRSV రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ.ఇప్పటికే కోచింగ్, శిక్షణ,హాస్టల్ ఫీజులకే వేలకు వేల రూపాయలు ఖర్చుపెడుతున్న అభ్యర్థులకు ఇది భారం కానుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా టెట్‌కి ఒక్కో పేపర్‌కి వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాలి అనడం మూర్ఖత్వమేనని అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయమని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. ఆన్ లైన్ పరీక్ష పేరిట వేలకు వేల రూపాయలు వసూలు చేయటం సరికాదు. వెంటనే టెట్ ఫీజు తగ్గించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు నాగేందర్, అవినాష్,శ్రీకాంత్,రాకేష్,క్రాంతి, జాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు.