బీఆర్ఎస్ పార్టీకి షాక్ కాంగ్రెస్ పార్టీలోకి వడ్లనందు

0
19 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరుతున్ననట్లు ప్రకటించారు. అయితే జడ్పీ చైర్ పర్సన్ బాటలో బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ కారుడు వడ్ల నందు పార్టీ మారేందుకు సిద్దమయ్యాడు. జడ్పీ చైర్ పర్సన్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే వడ్లనందుకు మాజీ ఎమ్మెల్యేకు మధ్య విబేదాలు ఉండడం ప్రస్తుత తరుణంలో నియోజకవర్గ ఇన్ చార్జి లేదా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నందుకు అధిష్టానం నుంచి స్పష్టమైన హామి రాక పోవడంతో పార్టీ మారాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వారితో పాటు పలువురు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ మారనున్నానారు.

కారు ఖాళీ హస్తంకు మంచిదేనా..?

ఇదిలా ఉంటే కారు పార్టీ నుంచి హస్తం గూటికి వలసలు మొదలైన క్రమంలో హస్తం నాయకుల్లో భయం మొదలైెంది. ముందు నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా కొత్త వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇస్తే గొడవ వస్తుందని భయ పడుతున్నారు. గతంలోను బీఆర్ఎస్ పార్టీలో ఈ గొడవలుు  జరుగడంతోనే పార్టీ ఓటమి పాలైందని చివరకు కేసులు, వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి.ఈ క్రమంలోనే  కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రూపు రాజకీయాలు జరిగే అవకాశం ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందు వచ్చిన పలువురు నాయకులకు పాత నాయకులకు మధ్యనే లోలోపల రగులుతున్న బయట పడని సందర్బంలో ప్రస్తుత చేరికలు మరింత అగ్గి రాజేసి గ్రూపులు ఏర్పాటై  తప్పని సరిగా గొడవలకు దారి తీసి పార్టీ చీలే అవకాశం ఉంటుందనే చర్చ జిల్లాలో మొదలైంది.