ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
25 Views

వికారాబాద్:ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.సోమవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల ఏం పి డి ఓ లు, ఎ పి ఓ లు , టి ఎ లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడుతూ గ్రామ పరిదిలో ఎన్ ఆర్ ఇ జి ఎస్ యంత్రాంగం కూలీల సంఖ్య ను పెంచుతూ పనులు చేయిoచాలని, విదులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామా లలో జాబ్ కార్డు ఉన్న వారికీ పని కల్పిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అనుకున్న అంచనా ప్రకారం కూలీల సంఖ్య ను పెంచుకోవాలన్నారు. క్లస్టర్ వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఊరికి ఉపయోగపడే పనులు చేపట్టాలని , గ్రామా పరిదిలో ఉండే చిన్న చిన్న సమస్యలను మండల అధికారుల దృష్టి కి తీసుకురావాలని ఆదేశించారు. వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందాలని సూచించారు. గ్రామా లలో ఎక్కడైనా పైప్ లీకేజీ ఉంటె వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పంచాయతి సెక్రటరీలు, ఎ ఇ లు , ఎం పి డి ఓ ల అద్వర్యం లో త్రాగు నీటి సమస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమస్య పరిష్కరించే విదంగా ముందుకెళ్ళాలని సూచించారు. మండలాల వారీగా ఎన్ ఆర్ ఇ జి ఎస్ పనుల ప్రగతి పై చర్చించారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి సుధారాణి , మిషన్ బగీరథ ఇంట్రా ఇ ఇ బాబు శ్రీనివాస్ , గ్రిడ్ ఇ ఇ చల్మారెడ్డి, ఎంపిడిఓ లు, ఎంపీఓ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.