ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పై బిగుస్తున్న ఉచ్చు….బకాయిలు చెల్లించకుంటే ఆస్తుల సీజ్, జప్తునకు కార్యాచరణ

0
38 Views

జహీరాబాద్: చెరకు రైతులకు బకాయిలు చెల్లించకుండా.. అధికారులు ఎన్నిసార్లు నోటీసులు జారీ
చేసినా సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రైడెంట్ చక్కెర కర్మాగారం చుట్టూ
ఉచ్చు బిగుస్తోంది. యాజమాన్యంపై కొరడా ఝుళిపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
జహీరాబాద్ మండలం కొత్తూర్ (బి) గ్రామంలోనిచక్కెర కర్మాగారం యాజమాన్యం ఏడాదిన్నరగా
రైతులు బకాయిలు చెల్లించకుండా వేధిస్తోంది. ఈవిషయంపై జిల్లా యంత్రాంగా అధికారులు సీరియస్ అయ్యింది. పరిశ్రమ ఆస్తులు, యాజమాన్యానికి సంబంధించిన ఇతర ఆస్తులను సైతం జప్తు చేయాలని నిర్ణయించింది. కలెక్టర్ వల్లూరి క్రాంతి అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిశ్రమపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు .
ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్, రాష్ట్ర నిజాం షుగర్స్ రివైవల్ కమిటీ సభ్యుడు ఎ.చంద్రశేఖర్, కర్మాగారం యజమాని రామ్నాథ్, జహీరాబాద్ ఆర్డీఓ వెంకారెడ్డి, కేన్ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం తీసుకోనున్న చర్యల గురించి యాజమాన్యానికి సైతం వెల్లడించారు.చెరకు రైతులకు జహీరాబాద్ లో ట్రైడెంట్ చక్కెర కర్మాగారం
రూ.9కోట్లు, కార్మికుల వేతనాలు రూ.2.40 కోట్లు పరిశ్రమ బకాయి పడింది. వీటిని చెల్లించే విషయంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది.ఇప్పటికే కేన్, రెవెన్యూ అధికారులు రెవెన్యూ యాక్టు కింద కర్మాగారం ఆస్తులను జప్తు చేసేందుకు నోటీలు ఇచ్చారు. ఫైనల్ నోటీసు జారీ చేయడంతో పాటు కర్మాగారం ఆస్తులను వేలం వేసి రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకుసంబంధించి కోర్టు కేసు ఉన్నందున కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. కోర్టు అంశం కొలిక్కి వస్తే ఈనెల 28వ తేదీన ఫైనల్ యాక్షన్ అమలు చేసే దిశలో ప్రయత్నాలు సాగుతున్నట్లుతెలుస్తోంది.
ఆలోగా యాజమాన్యం బకాయిలు చెల్లిస్తే సమస్యపరిష్కారమయ్యే అవకాశం ఉంది. లేదంటే యాజమాన్యంపై చీటింగ్ కేసులు సైతం పెట్టేయోచన ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఆస్తులు వేలం వేసేందుకు వీలుగా కసరత్తు ముమ్మరం చేసేదిశలో
అధికార యంత్రాంగం పావులు కదుపుతోంది.