వికారాబాద్ పట్టణంలోని భూముల అమ్మకానికి సిద్దమైన ప్రభుత్వం 18 ఎకరాలు అమ్మకానికి

0
16 Views

వికారాబాద్ : వికారాబాగ్ పట్టణంలోని గంగారం ఆలంపల్లిలోని రాజీవ్ స్వగృహాకు సంబంధించిన భూములను అమ్మెందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. గతంలో ఆలంపల్లిలో 15 ఎకరాలు , గంగారం 3 ఎకరాలను అప్పట్లో కేటాయించగా అవి అలాగే మిగిలిపోయాయి . దీంతో అట్టి భూములను జిల్లా కలెక్టర్ సమక్షంలో విక్రయించేందుకు ముహుర్తం ఖరారు చేశారు. ఈ నెల 14 న నిర్వహించే ఈ వేలంంలో ప్రభుత్వ ధర ఎకరా రూ. 59 లక్షలుగా నిర్ణయించారు.

ఇదిలా ఉంటే రాజీవ్ స్వగృహ సంబంధించిన భూములను అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కేటాయిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమ్మడం పట్ల వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . వికారాబాద్ లో ప్లే గ్రౌండ్ తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాలు కేటాయించాలంటే స్థలాలు లేవని చెప్తున్నా రెవెన్యూ అధికారులు ఇప్పుడు విక్రయించేందుకు సిద్ధమైన రాజీ వ్ సగృహ స్థలాలను వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన భవనాల కోసం ప్లే గ్రౌండ్ కోసం కేటాయిస్తే బాగుంటుందని ఇలా అమ్ముకోవడం వల్ల వికారాబాద్ ప్రాంతానికి ఒరిగేది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమిటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వికారాబాద్ ప్రాంత ప్రజలు హెచ్చరిస్తున్నారు.