ఆత్మరక్షణకు ఆత్మస్థైర్యానికి కరాటే శిక్షణ ఎంతో దోహదపడుతుంది: జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి

0
24 Views

వికారాబాాద్ : ఆత్మరక్షణకు ఆత్మస్థైర్యానికి కరాటే శిక్షణ ఎంతో దోహదపడుతుందని జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు./ఆదివారం వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాలులో మాస్టర్ జపాన్ షోటో ఖాన్ కరాటే డు అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం విద్యార్థులు వారి ప్రతిభ కనబరిచారు./ఈ సందర్భంగా చైర్పర్సన్ సునీతమ్మ మాట్లాడుతూ… ప్రస్తుత సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ చిన్ననాటినుండే కరాటే శిక్షణ తెసుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు కరాటే పై ఆసక్తి చూపించాలన్నారు. కరాటే ద్వారా ఆత్మరక్షణ తోపాటు ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలిపారు. మెదడును మానసిక ఆందోళన చెందకుండా చురుకుగా ఉంచుతుంది అన్నారు.

కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ సందర్భంగా టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ మహమ్మద్ కాజా పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి విజయ్ లు జడ్పీ చైర్ పర్సన్ , మున్సిపల్ చైర్ పర్సన్ లను శాలువాతో సన్మానించి మేమొంటో అందజేశారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ చంద్రకళ, కోటపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు హన్మంతు రెడ్డి, రామ్ చంద్ర రెడ్డి,వడ్ల నందు కౌన్సిలర్ చందర్ నాయక్,పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.