గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తాం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్

0
16 Views

వికారాబాద్ : గ్రంథాలయాలను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు . సోమవారం జిల్లా  గ్రంథాలయంలో 55వ జాతీయ  గ్రంథాలయ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్టాడుతూ. అతి పురాతనమైన వికారాబాద్ జిల్లా గ్రంథాలయాన్ని మరింత అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గ్రంథాలయాలు ఉన్నాయని త్వరలో మర్పల్లి, దోమలో గ్రంథాలయాలు ప్రారంభం కానున్నాయన్నారు. కొడంగల్ రూ. 50  లక్షలతో నిర్మాణ దశలో ఉందన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు అవుతున్నభవనంలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. 19న వారోత్సవాల్లోభాగంగా రంగోళి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 20న ముగింపు సభ ఉంటుందని తెలిపారు. రిడర్స్ కు ఎలాంటి పుస్తకాలు కాావాలన్నా ముందు చెబితే 15 రోజుల లోపు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్ బాబు, నాయకులు విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, యాదయ్య, వెంకటస్వామి, వెంకట్ రెడ్డి, కేకే తదితరులు పాల్గొన్నారు.