గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
21 Views

వికారాబాద్: గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం “మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా *వికారాబాద్* మండల పరిధిలోని *ఎర్రవల్లి* గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పాత స్థంబాలను తొలగించి, గ్రామంలో మరియు పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, అవసరమైన చోట విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేసి, విద్యుత్ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ… సేవలందించాలన్నారు. గ్రామంలోని పశువులకు ట్రెవిస్ స్టాండ్ ఏర్పాటు చేసి, గ్రామంలో పశువుల డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని పశు వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎర్రవల్లి, పులుమద్ది మరియు దుర్గంచెరువు గ్రామాల మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని వికారాబాద్ డీపో మేనేజర్ గారితో మాట్లాడారు. గ్రామంలో మురుగు కాలువలు, పిచ్చి మొక్కలు, తొలగిస్తూ… శానిటేషన్ చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. నూతనంగా నిర్మించిన ఇళ్ళతోపాటు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, లీకేజీలు లేకుండా ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంక్ ను నెలలో 1, 11, 21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.